more quotes and replies from SS Swami
83. బాబు: శరణాగతి అంటే?
సద్గురు: జీవితమనేది Already షూటింగ్ పూర్తయిపోయి, రిలీజ్ అయిపోయిన సినిమా లాంటిది. సినిమా పూర్తయ్యే వరకు ఇక నీవు చేయగలిగేది, మార్చగలిగేది ఏమీలేదు. సాక్షిగా ప్రేక్షకుడుగా చూస్తూ ఉండడం తప్ప. సుఖమైనా, దుఃఖమైనా Face చేయి, Taste చేయి. అన్నిటికీ సిద్ధపడి ఉండడమే మహాసిద్ధి. అదే శరణాగతి.96. ఒకరు: కొన్ని బోధలు మాకు నచ్చలేదు స్వామీ...
సద్గురు: మాక్కూడా నచ్చలేదు.
సత్యానికి మన ఇష్టాయిష్టాలతో పనిలేదు.
97. ఒకరు: సైన్సుకు, ఆధ్యాత్మికానికి తేడా ఏమి?
సద్గురు: సైన్సు అనేది విడువబడిన బాణం యొక్క శక్తిని గుఱించి చెబుతుంది.
ఆధ్యాత్మికం అనేది బాణం విడిచినవాని యొక్క శక్తిని గుఱించి చెబుతుంది.
98. ఒకరు: నా జన్మ తరించడం ఎలా?
సద్గురు: తరించడం సంగతి అలా ఉంచు...
తరించిన తర్వాత నీ ప్రోగ్రాం ఏమి? ఆలోచించు.
99. చిలకమ్మ: ఎందుకు పుట్టామో? ఎందుకు జీవిస్తున్నామో తెలియటం లేదుస్వామీ...!
సద్గురు: మనల్ని భూమ్మీదకు పంపినవానికొక్కనికి మాత్రమే ఆ రహస్యం తెలుసును. భూమ్మీద ఉన్న ఎవ్వడికీ తెలియదు.
100. ఒకరు: ఒక వ్యక్తిని దేవుడని పూజిస్తున్నారు... అది సరియేనా?
సద్గురు: చెట్లని-పుట్లని, నందిని-పందిని దేవుడని కొలిచే సంప్రదాయం మనది. మనిషిని దేవుడని కొలవడం తప్పేముంది?
101. భూపతి: భగవంతుడు జీవుల్ని ఎందుకిట్లా అడిస్తున్నాడు?
సద్గురు: వచ్చిన కలను తప్ప
నచ్చిన కలను చూడడం కుదరదు.
ఒకరు: ఆత్మానుభవం ఎలా కలుగుతుంది?
సద్గురు: నీవు లేకపోతే ఉండేది అదే.
ఆ అనుభవం లేకపోవడానికి కారణం నీవే.
నీవుంటే అనుభవం ఉండదు.
అనుభవం ఉంటే నీవుండవు.
నీవే తేల్చుకో...
నీవుండాలో, అనుభవం ఉండాలో.
* * *
మనం అనుకునే ఈ మెలకువ
నిజానికి ఇదొక కల.
ఇందులో అన్ని భేదాలూ ఉంటాయి.
భేదాలు ఉండడమే 'ఇది కల' అనడానికి ప్రధానమైన గుర్తు.
ఏ భేదమూ తోచకపోవడమే నీవు నిజమైన మెలకువలో(జ్ఞానములో) ఉన్నావని గుర్తు.
* * *
25. అస్కలిత బ్రహ్మచర్యం గుఱించి ప్రస్తావన వచ్చినప్పుడు.... గురువుగారు ఇలా అన్నారు-
వీర్యస్కలనంతో పోయే జ్ఞానం జ్ఞానమేనా? అలాంటి జ్ఞానం మనకొద్దు. పోతేపోనీ.
జ్ఞానం అనేది ఒకదానితో రాదు,ఒకదానితో పోదు.
2.ఒకరు: అంతా దైవస్వరూపమే అయినప్పుడు....
ప్రపంచంలో హెచ్చుతగ్గులు ఎందుకున్నాయి?
సద్గురు:
గంగాళాన్ని సముద్రపునీటితో నింపినప్పుడు...
సముద్రపునీరు, గంగాళంలో ఉన్న నీరు
రెండూ ఒకటే అయినప్పటికీ
సముద్రంలో ఉన్నరీతిగా
గంగాళంలో ఉండే నీటికి ఆటుపోట్లు ఉండడంగానీ,
తిమింగలాలు మొదలైన జలచరాలు ఉండడంగానీ,
ఓడలు,నౌకలు ఉండడంగానీ
ఉండవు.
రమణులు, రామకృష్ణాది మహనీయులనేవారు కూడా
సముద్రపునీటితో నిండివున్న పాత్రలే తప్ప సముద్రం కాదు.
సాధారణులు, మహనీయులు అనే తేడాలనేవి
పాత్రల పరిమాణాల్లో తేడాలు తప్పితే
పాత్రలలో ఉన్న 'నీరు' గా అంతా సమమే.
అన్ని పాత్రలలో ఉండేది సముద్రమేగాని
సముద్రం కాదు.
సముద్రంలో ఉన్న పాత్రల లోపలా బయటా
సముద్రమే ఉన్నట్లు
దైవంలోనే సకలమూ ఉందని ఉండడమే పరిపూర్ణత్వం.
సముద్రం(దైవం) సదా ఏకవచనం.
* * *
నామారూపాలకు ప్రాధాన్యత ఇస్తే పాత్రలుగా ఉంటాం.
నామరూపాలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే సముద్రంగా ఉంటాం.
Labels: ఆత్మ విచారణ

