Sadguru Subramanya swami , short answers 1-21 various Questioners
129. నేనే ప్రశ్న - నేనే సమాధానం - 1
_____
1. బాబు: నేనే ప్రశ్న - నేనే సమాధానం గ్రంథం చదవడానికి అర్హత ఏమి?
సద్గురు: ఆర్తి(నిజమైన అవసరం)
2. బాబు: నేనే ప్రశ్న - నేనే సమాధానం అంటే అర్థమేమి?
సద్గురు: ప్రశ్నించేవాడే సమాధానం.
3. దేవీప్రసాద్: ప్రశ్నే పుట్టని స్థితిని సాధించడం ఎలా?
సద్గురు: 'నేను' పుట్టు చోటుకు చేరుకుంటే సరి.
4. బాబు: తలంపులను అణచి ఆత్మను తెలుసుకోవాలని అంటారు...
సద్గురు: ఇది చాలా శ్రమతో కూడిన సాధన.
"తలంపురూపంగా ఉన్నది ఆత్మయే" అని తెలుసుకుంటే, తరువాత తలంపులున్నా నీవు తలవనివాడివే అవుతావు.
5. బాబు: భగవత్సాక్షాత్కారం అంటే?
సద్గురు: మనం ఇక్కడ పదిమంది ఉన్నాం...
పదకొండవవాడు కాడు భగవంతుడు.
మన పదిమంది రూపాల్లో ఉండేది భగవంతుడే అని తెలుసుకుంటే అదే భగవత్సాక్షాత్కారం.
6. బాబు: ప్రత్యేకించి సాధన అవసరం లేదంటారా?
సద్గురు: అవసరం లేదు...
"అతడే నేను" అన్న జ్ఞప్తి ఉంటే చాలు.
7. బాబు: మరి దేశంలో ఇన్ని ధ్యానకేంద్రాలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి...
సద్గురు: (నవ్వుతూ) ఈ ధ్యాన కేంద్రాలలో సాధన చేయడం కంటే శ్మశానంలో ఏదయినా సమాధి అరుగుమీద కాసేపు కూర్చొని గడపడం మంచిది.
అంతకు మించిన సాధనే లేదు.
ఆ సమయం నీకు ఎన్నో జీవితసత్యాలను ప్రబోధిస్తుంది.
8. బాబు: సన్న్యాసం తీసుకునే ముందు తల్లి లేదా భార్య అనుమతి తప్పనిసరి అంటారే...
సద్గురు: పొందవలసినదానిని పొందిన తరువాత సన్న్యాసం తీసుకున్నవారికి ఎవరి అనుమతీ అవసరం లేదు.
ఉదా. శ్రీరమణమహర్షి
సన్న్యాసం తీసుకొని పొందాలనుకునేవారు తప్పనిసరిగా తల్లి లేదా భార్య అనుమతి తప్పనిసరి.
ఉదా. శ్రీఆదిశంకరులు
9. చిలకమ్మ: ఇక ఈ జన్మ చాలు అనుకుంటున్నాను స్వామీ....
సద్గురు: కథలోని ఓ పాత్ర, ఇక నాకు ఈ పాత్ర చాలు...అనుకుని రచయితకు తెలియకుండా కథలోంచి విరమించుకునే వీలు ఆ పాత్రకు ఉంటుందా?
ఏ పాత్ర ఎప్పుడు ప్రవేశపెట్టాలో,
ఎప్పుడు నిష్క్రమింపచేయాలో
విశ్వకథారచయిత అయిన భగవంతుని ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది.
10. శశిరేఖ: లోకాన్ని ఉద్ధరించడం కాదు,
ముందు నిన్ను నీవు ఉద్ధరించుకో అని రమణభగవానులు అన్నారు...
లోకోద్ధరణే మోక్షదాయకమన్నట్లు వివేకానందులు ప్రబోధించారు...
ఏది సరి?
సద్గురు: అంతర్ముఖంలో తనను తాను చూసుకునే ఉపాయాన్ని బోధించినవారు - శ్రీరమణులు.
బహిర్ముఖంలో తనను తాను చూసుకునే ఉపాయాన్ని బోధించినవారు - వివేకానందులు.
11. పట్టెయ్య: ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వలన దేనికీ అంటని స్థితి నాకు కలిగిందండీ....
సద్గురు: మంచిది...ఇక పట్టెయ్యను కూడా అంటనిస్థితిని సాధించు...
12. గురప్ప: రమణభగవానులు తాను అవతారపురుషుడనని ఎక్కడైనా చెప్పి వున్నారా?
సద్గురు: చెప్పి ఉండేవాడే, కాని చెప్పడానికి ఆయనకు ఇతరం కనిపించలేదు.
13. బాబు: గురుదక్షిణ గుఱించి చెప్పండీ...
సద్గురు: నీవు ఎవరికి ఏమి ఇచ్చినా, తనకు తాను ఇచ్చుకున్నట్టుగా నీకు అనిపిస్తే అదే గురుదక్షిణ.
14. హరి: మోక్షం అంటే ఏమిటి?
సద్గురు: దైవం కంటే భిన్నంగా ఏమీ లేదు...
నేను కూడా దైవమే అన్న అనుభవమే మోక్షం.
15. సద్గురు: బాబూ! ఈరోజు నీవు ఒక్కసారైనా "ఈ జాగ్రదవస్థ స్వప్నం లాంటిదే" అన్న జ్ఞప్తి కలిగిందా?
బాబు: లేదండీ...
సద్గురు: అయితే ఈ రోజు నీవు ఒక్కసారి కూడా భగవంతుణ్ణి తలవనట్లే.
"ఈ జాగ్రదవస్థ స్వప్నం లాంటిదే" అన్న జ్ఞానం ఒక్కటుంటే చాలు...అన్ని జ్ఞానాలూ నీకున్నట్లే. సదా భగవంతుణ్ణి నీవు తలుస్తున్నట్లే.
16. బాబు: ఆత్మ అంటే?
సద్గురు: ఒక వస్తువు వుండాలంటే, కొంత అవకాశం ఉండాలి కదా! అలాగే సకలసృష్టికి ఆధారమైన విశ్వాంతరాళము ఉండటానికి అవకాశంగా ఉన్నదేదో అదే ఆత్మ.
17. బాబు: పురుషోత్తముడు అంటే?
సద్గురు: ఉత్తమపురుషము(నేను) యొక్క తత్త్వాన్ని ఎఱిగినవాడు.
18. చిలకమ్మ: ఎందుకు నేను ఈ బాధలు పడాలి?
సద్గురు : ఎందుకు పడకూడదు?
19. చిలకమ్మ: జ్ఞానులు పొందిన స్థితిని నేనెందుకు పొందలేకపోతున్నాను?
సద్గురు: అలా చెప్పిన జ్ఞాని యెవరు?
20. చిలకమ్మ: ఆలస్యాన్ని భరించలేకున్నాను...
త్వరగా ముక్తిని పొందటానికి మార్గం చూపండీ...
సద్గురు: మీరు మీ ఇంటికి(స్వస్థానానికి) చేరడానికి మార్గం ఎవరు చూపగలరు?
21. బాబు: బ్రహ్మము అంటే?
సద్గురు: ఏ మనస్సయితే తనతో సహా సకలాన్ని త్రోసివేస్తుందో...
ఏ మనస్సయితే తనతో సహా సకలాన్ని తనలో ఇముడ్చుకుంటుందో
ఆ మునస్సే బ్రహ్మము.
22. బాబు: భగవద్గీత సారమేమి?
సద్గురు: Don't Expect...
23. బాబు: ఆత్మానుభవం అంటే?
సద్గురు: ఉన్నది ఉన్నట్లుగా, ఒకటిని ఒకటిగా, దానినే అదిగా, తననే తానుగా అనుభవించడమే ఆత్మానుభవము.
24. సద్గురు: జ్ఞానాన్ని మనం సంపాదించేది కాదు.
జ్ఞానం ఎవరిని ఎన్నుకుంటుందో వారే జ్ఞానులవుతారు.
చిన్నా: అది కొంతమందినే ఎందుకు ఎన్నుకుంటుంది?
సద్గురు: దాని గుఱించి ఇదమిత్థంగా ఏమీ చెప్పలేం.
25. అన్నాజీరావు: రమణభగవానులు ఆధ్యాత్మికంలో ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నవారు.
కానీ క్రిందనున్నవాళ్లకి ఓ త్రాడు వేసి పైకి ఎక్కించాలి కదా...!

CS
DK
08:04
Labels: Ramana Kendram
posted by Borrowed Wisdom at 6:19 AM
![]()


0 Comments:
Post a Comment
<< Home