సద్గురు సుబ్రమణ్యం గారి ఏక వాక్య జవాబులు 26-55
25. అన్నాజీరావు: రమణభగవానులు ఆధ్యాత్మికంలో ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నవారు.
కానీ క్రిందనున్నవాళ్లకి ఓ త్రాడు వేసి పైకి ఎక్కించాలి కదా...!

CS
DK
08:04
సద్గురు: త్రాడు వేసి పైకి లాగాలనే ఉంది భగవానుకు. కానీ అక్కడ (తనకు విడిగా) ఎవరూ కనిపించలేదే!
26. హరి: సాధన అవసరమా? కాదా?
సద్గురు: అవసరమైనట్టు అనిపిస్తుంది...
కానీ అవసరం లేదు.
27. వరలక్ష్మి: నాకు మంచి ఉపాసన చెప్పండీ...
సద్గురు: అందరూ "ఒక్కడి"లో ఉన్నారు.
ఆ ఒక్కడే అందరిలో ఉన్నాడు.
అని సదా స్మరించుకోండి....
28. బాబు: తనకు ఓ గురువు వుండి, మరో గురువు చేసిన ఉపదేశాన్ని స్వీకరించవచ్చా?
సద్గురు: ఈశ్వరుడే దిగివచ్చి చెప్పినా సరే స్వీకరించవద్దు.
నీ గురువాక్కే నీకు పరమప్రమాణం.
29. శైలజ: గురువుగారూ! మీ ఆశీర్వాదం కావాలండీ...
సద్గురు: అది ఎప్పుడు లేదో చెప్పండీ...
30. బాబు: పొందటంలో శాస్త్రప్రయోజనం ఉన్నదా?
సద్గురు: శాస్త్రం వలన పొందటం జరుగదు.
పొందవలసినదానిని పొందిన తరువాత శాస్త్రం రూఢి పరుస్తుంది. అంతవఱకే శాస్త్రప్రయోజనం.
31. చెంచురామయ్య: చూడండి స్వామీ...!
ఆ కొట్టువాడి మోసం...
రూపాయికి ఎంత కొద్ది కర్పూరం ఇచ్చాడో...
సద్గురు: ఎంత కర్పూరం వెలిగించావో అన్నది ముఖ్యం కాదు...
ఎంత ఖర్చు పెట్టావో అన్నదే ముఖ్యం.
వాడు చేసింది వాడి ఖాతాలోకి పోతుంది.
నువ్వు చేసింది నీ ఖాతాలోకి పోతుంది.
32. బాబు: ప్రాణానికి, చైతన్యానికి తేడా ఏమిటి?
సద్గురు: ప్రాణం లబ్-డబ్ అంటుంది.
చైతన్యం నేను-నేను అంటుంది.
33. సుబ్బు: ఆనందంగా ఉంటాలంటే ఏంచేయాలి?
సద్గురు: ఏమీ చేయొద్దు...
నీవు ఏంచేసినా సరే
అది నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేయడమే.
34. పట్టెయ్య: గురువుగారూ! మీతో కలిసి అరుణాచల ప్రదక్షిణం చేయాలని ఉంది...
సద్గురు: అరుణాచలమే నా చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది...
35. కుమారస్వామి: గురువుగారూ! మా మిత్రుడు బత్తెయ్య చనిపోయాడు...
సద్గురు: మనం మాత్రం బ్రతికన్నామా కుమారస్వామీ...
36. వీరబాబు: గురువుగారూ! అరుణాచలప్రదక్షిణం చేయడానికి పౌర్ణమి ఘడియలు ఎప్పుడున్నాయో చెబుతారా?
సద్గురు: నీవెప్పుడు గిరిప్రదక్షిణ చేస్తావో, అప్పుడే పౌర్ణమి.
37. విజయమ్మ: న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వ మానశుః అని శ్రుతివాక్యం...
త్యాగం చేయడమెట్లా?
సద్గురు: నీదంటూ ఏదన్నా ఉన్నదా? ముందు తేల్చు....తర్వాత దానిని ఎట్లా త్యాగం చేయాలనేది తర్వాత ఆలోచిద్దాం...
38. బాబు: జీవిత లక్ష్యమేమి?
సద్గురు: జీవించడమే.
39. పట్టెయ్య: అన్నింటిలో చైతన్యం ఉంది కదా?
సద్గురు: చైతన్యంలో అన్నీ ఉన్నాయి.
40. బాబు: ఆత్మప్రదక్షిణ అంటే?
సద్గురు: అచలంగా ఉండడం.
41. మునెయ్య: అందరూ రమణమహర్షుల్లా అయిపోతే లోకం జరిగేదెట్లా?
సద్గురు: అందరి సంగతి వదిలేయ్! ముందు నువ్వు అవ్వు చూద్దాం...
42. బాబు: యెవడు నమస్కార యోగ్యుడు?
సద్గురు: "నాకు బాధలే లేవు" అని యెవడైనా అంటే, వాడే నమస్కార యోగ్యుడు.
43. ప్రశ్న: దేవుడెక్కడున్నాడు?
సద్గురు: నీలోనే ఉన్నాడు.
నీవుగానే ఉన్నాడు.
44. ప్రశ్న: సన్న్యాసి ధనరూపేణా దక్షిణ స్వీకరించవచ్చా?
సద్గురు: స్వీకరించవచ్చు....కానీ చీకటి పడేలోపు మొత్తం ఖర్చు చేసేయాలి. అప్పుడే ఆ దక్షిణ వలన దోషం ఉండదు.
45. డాక్టర్ మురుగేశన్: స్వామీ! నా ప్రాక్టీసు బాగా జరిగేటట్టు ఆశీర్వదించండీ...
సద్గురు: అంటే లోకంలో రోగులు పెరగాలనా నీ ఉద్దేశం? ఈ విధమైన ప్రార్థన సరికాదు. రోగి రోగం ఉండి నీ వద్దకు రాడు. నిన్ను అనుగ్రహించడానికిగాను భగవంతుడే రోగి రూపంలో వస్తాడని ఎఱుక కలిగి వైద్యం చేయి...
46. ఒకరు: ఇల్లు ఈశాన్యం వైపుకు తిరిగి ఉంటే మంచిదని అంటారు...
సద్గురు: బుద్ధి ఈశాన్యం(అధిపతి ఈశ్వరుడు)వైపుకు తిరిగి ఉంటే మంచిది.
47. ఒకరు: ఓ మంచి ఆధ్యాత్మిక సాధన ఏదయినా చెప్పండి...
సద్గురు: ఎప్పుడూ ఎక్కడా నీ సంతకం చేయొద్దు...
48. బాబు: శ్రీరమణాశ్రమంలో పాశ్చాత్య భక్తుల నడవడికలను చూస్తుంటే, మన కల్చర్ ను మన కంటే వాళ్లే బాగా కాపాడుతున్నట్టు అనిపిస్తోంది...
సద్గురు: అవునవును...వాళ్ల కల్చర్ ను మనం కాపాడుతున్నాం కదా...
49. చిలకమ్మ: ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలియడం లేదు స్వామీ...
సద్గురు: ముందు చిలకమ్మను నమ్మొద్దు...
50. బాబు: మాయ నిత్యమైనదా? అనిత్యమైనదా?
సద్గురు: "ప్రపంచంలో నేనున్నాను" అన్న వర్గదృష్టిలో మాయ నిత్యమైనది.
"నాలో ప్రపంచం ఉన్నది" అన్న వ్యక్తిగతదృష్టిలో మాయ అనిత్యమైనది.
51. ఒకడు: అరుణగిరి ప్రదక్షిణం యొక్క ఫలమేమి?
సద్గురు: "ఇప్పటివఱకు ఎవరూ అరుణగిరి ప్రదక్షిణం చేసిందే లేదు" అని మనసుకు తోయడమే ఫలం.
52. ప్రశ్న: ఈ సృష్టి ఎలా జరిగింది?
సద్గురు: అచలస్వరూపుడైన పరమాత్మునిలో స్వాభావికంగా ఉన్న సంకల్పవైభవమే ఈ మహాసృష్టి.
53. ఒకరు: కామికానివాడు మోక్షగామి కాడు అన్నారు వేమన...
సద్గురు: దాని అర్థం మోక్షాన్ని పొందాలంటే ముందుగా కాముకులుగా ఉండాలనేది ఆయన భావం కాదు. కామి కాకపోతే మోక్షాన్ని కూడా కామించడు(కోరడు)అని భావము.
54. ఒకరు: ధ్యానంలో నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది స్వామీ...!
సద్గురు: తిరగనీ... ఆత్మ అనంతము, సర్వవ్యాపకము కదా! మనసు ఎక్కడెక్కడ తిరిగినా అంతా ఆత్మలోనే కదా! తిరగనీ....
55. ప్రశ్న: సహజసమాధి అంటే?


DK
08:04
సద్గురు: "అంతా సహజంగా ఉంది" అని ఉండడం.
Labels: ఆత్మ విచారణ
posted by Borrowed Wisdom at 8:13 AM
![]()


0 Comments:
Post a Comment
<< Home