Wednesday, May 13, 2020

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
ఇది శృతి వాక్యం... శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది....
ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం.... 
భగవాన్ కూడా శ్రద్ధ అనే విషయానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు.... ఒక పని కానీ, ఒక ఉపాసన కానీ, ఆత్మ విచారణ కానీ, ఎంతో శ్రద్ధతో చేయమని చెప్పేవారు... 
ఎవరు ఏ పని చేస్తున్నా ఎవరి కోసమో చేయటం కాకుండా మీ కోసమే చేయటం చేత కావాలి......
భగవాన్ చెప్పిన ప్రకారం శ్రద్ధ నే క్రమంగా భగవంతుని అనుగ్రహం గా మారుతుంది....  భగవాన్ అనేక మందికి అనేక సార్లు చెప్పి ఉన్నారు... భగవంతుని అనుగ్రహం కొరకు ప్రత్యేకంగా వేచి చూడకుండా మీరు చేసే పనిని శ్రద్ధగా చేస్తూ ఉంటే అదే కాలక్రమంలో భగవంతుని అనుగ్రహం గా మారుతుందని చాలాసార్లు చెప్పారు....
మనం ఈ లోపాన్ని సరిదిద్దుకొని భగవాన్ చెప్పినట్టుగా, మన సొంత తెలివి పెట్టకుండా ఆత్మవిచారణ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా గమ్యం చేరవచ్చు....

Labels:

0 Comments:

Post a Comment

<< Home