Bhastulu vaari yuktulu
భగవాన్ ఇక రెండు రోజుల్లో శరీరం వదిలేస్తారు అనగా కొంతమంది భక్తులు భగవాన్ ను అడిగారు భగవాన్ మీరు శరీరం వదిలేస్తారని మాకు అర్థమవుతోంది, తర్వాత మేము ఎలా నడుచుకోవాలి?? మాకు కర్తవ్యాన్ని తెలపండి అని అడిగితే, భగవాన్ ఇలా చెప్పారు... నేను చెప్పవలసినదంతా చెప్పాను.. మీరు చేయవలసినది నా బోధను ఆచరణలో పెట్టడమే.....
ఈ విషయంలోనే రమణ భక్తులం అని చెప్పుకొనే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు.....
ఆయన, బోధను ఆచరణలో పెట్టమని చెపితే, ఈ భక్తులు మరియు అద్వైత గురువులు సుదీర్ఘంగా చర్చలు చేస్తున్నారు.... చర్చలు చేయటమే సాధన అని పొరబడుతున్నారు... ఈ చర్చల్లో అనేక రకాలైన విషయాలను మాట్లాడుకుంటున్నారు.... ఆఖరికి అమ్మాయిల పెళ్లిళ్లు, ఉద్యోగాలు, అబ్బాయిల చదువులు, వీసా సమస్యలు, కుటుంబ కలహాలు, విడాకులు, ఒకటేమిటి మొత్తం సంసారమే మాట్లాడుకుంటున్నారు..
ఇవన్నీ ఒక ఎత్తైతే....
భగవాన్ అసలు జగత్తు ఏర్పడనే లేదు అని చెపితే, పాపం వీళ్ళు జగత్తు ఏర్పడటానికి కారణాలు ఏమిటి?? అని సంవత్సరాల తరబడి చర్చలు చేస్తూనే ఉన్నారు....
ఎవరికి వాళ్ళు లోపల విచారణ చెయ్యండి అని భగవాన్ చెపితే, వీళ్ళు మాత్రం మనసు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి??, స్వప్నం అంటే ఏమిటి??? సుషుప్తి అంటే ఏమిటి?? తురీయం అంటే ఏమిటి?? ఈ ప్రపంచం ఇలా ఎందుకు కనబడుతుంది ??? అని కొన్ని ప్రశ్నలను తయారు చేసుకొని ఎవరికి తోచింది వాళ్ళు చెపుతూ అంతులేని చర్చలు చేస్తూనే ఉన్నారు.....
ఇంకొంతమంది మరీ విచిత్రంగా మతాలు, మత మార్పిడులు, ఆచారాలు, సాంప్రదాయాలు, హిందూమతం, హిందూధర్మం అని ఇవి మాట్లాడుతున్నారు.... భగవాన్ మార్గంలో ఇవన్నీ ఉన్నాయా ???? 🤔 ఈ చర్చల వలన ఎవరైనా నిజమైన శాంతిని పొందారా ???? బుద్ది పరమైన సుఖాన్ని (intellectual appeasement) పొందుతారు తప్ప నిజమైన శాంతిని పొందలేరు....
ఎందుకంటే ఒక ప్రశ్నకు సమాధానం వెతికే ప్రక్రియలో ఇంకొన్ని ప్రశ్నలు పుట్టుకొస్తాయి....
కానీ భగవాన్ రమణ మహర్షి ఇచ్చిన మార్గం ఇది కాదు.... ప్రశ్నలు ఎవరికి పుడుతున్నాయో వాడిని మీ లోపల వెతకమన్నారు....... అసలు ప్రశ్నలే లేని స్థితిని పొంది, ఆ స్థితిలో మౌనంగా, నిశ్చలంగా ఉండమని ఆయన చెపితే, దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.... మాయ అంటే ఇదే కదా!
అంటే వీళ్ళు నిరంతరం మాయలోనే జీవిస్తూ, మేము ఆత్మజ్ఞానం పొందుతున్నాము అని అంటారేంటి అమాయకంగా.... 🤔 ఇంతకంటే విడ్డూరం ఇంకేమైనా ఉందా ??
భగవాన్ మార్గం లో ముఖ్యంగా ఉండవలసినవి శ్రద్ధ, అభ్యాసం...
ఆత్మ పట్ల శ్రద్ధ.... దాని గురించి నిరంతరం లోపల విచారణ అభ్యాసం చేస్తూ ఉండాలి...
ఇంక ఇక్కడ చర్చలకి, ప్రశ్నలకి, వాదనాలకి అవకాశం ఎక్కడ ఉంది..... కాస్త ఆలోచించండి....

Labels: Ramana Kendram

0 Comments:
Post a Comment
<< Home