Sunday, May 03, 2020

Travel towards Truth

సత్యం వైపుకు ప్రయాణించడానికి ఆధ్యాత్మిక మార్గం సహాయ పడుతుంది.... అయితే మనందరికీ నిజంగా సత్యమే కావాలని ఉందా?? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న... వాళ్ళను చూసి వీళ్ళను చూసి అనుకరించడం కాకుండా అసలు మీకు ఏమి కావాల్నో నిర్ణయించుకోవాలి.... ఆలోచన, మాట, చేత మూడు ఒకటే అయినప్పుడు గమ్యాన్ని చేరుకోవచ్చు.... మాటలు మాత్రం ఇక్కడ ఉండేదంతా మాయ అని చెపుతూ, నా సంసారాన్ని నేను కాపాడుకోవాలని ఆలోచిస్తూ, చేతల్లో సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయటం తనను తాను మోసం చేసుకోవటమే అవుతుంది.... 
నిజమైన సాధకుడు తనకు కావలసిన దానికోసం సర్వాన్ని త్యాగం చేస్తాడు.... మీరు కావాలంటే ఏ మహాత్ముడి జీవితాన్నైనా చూడండి....
త్యాగేనైక అమృతత్వ మానశుః
అని శాస్త్రం చెపుతోంది...... అంటే సర్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే అమృతత్వం (శాంతి) కలుగుతుంది... కానీ మనకు ఈ వాక్యం ప్రమాణం కాదు..... ఎందుకంటే మనకు వదలటం ఇష్టం ఉండదు.... ఎప్పుడు చూసినా ఏదో పొందాలని, ఏదో సాధించాలని, ఈ సంసారం, జీవితం సుఖంగా, రక్షణ గా ఉండాలని ఆలోచిస్తామే తప్ప అన్నీ వదలి పరమాత్మ వైపుకు నిజంగా ప్రయాణం చేద్దామని ఉండదు... ప్రతి ఒక్కరికి ఏదొక అశాంతి, అలజడి ఉంటూనే ఉంది.... ఈ కాలంలో సంసారులు, సన్యాసులు అందరూ ఒకే విధంగా ఉన్నారు......
మనం ఎలా తయారై ఉన్నామంటే ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఏదొక లోకంలో దేన్నో పట్టుకొని వ్రేలాడుతూ ఉండాలనే కోరికతో నిరంతరం అశాంతిగా ఉన్నాము...
ఒక మాట అడుగుతాను మీకు మీరే సమాధానం చెప్పుకోండి....
ఇప్పటికప్పుడు దేవుడు కనబడి రెండు మంత్రాలు ఇస్తాను అని అన్నాడు అనుకోండి...
మొదటిది జపం చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగి మీ సంసారం, జీవితం అన్నీ వృద్ధి లోకి వస్తాయి... మీరు మీ భర్త, భార్య, పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారు.....
ఇక రెండవ మంత్రం జపం చేస్తే మీ సంసారాన్ని మీరు మరచి పోతారు... మిమ్మల్ని మీరు మరచి పోతారు.... మీ పిల్లలు ఏడుస్తున్న, పాపం మీ భర్త లేదా మీ భార్య ఎంత బ్రతిమాలు కున్నా మీరు పట్టించుకోకుండా నాకు సత్యం కావాలి ఈ సంసారం ఒక భ్రమ అని వదలి వెళ్లి పోతారు..... అని చెప్పాడను కోండి....  మీరు ఏ మంత్రం జపం చేస్తారు... నిజాయితీగా సమాధానం చెప్పండి..... కాబట్టి ఊరకనే మాటలు మాట్లాడితే కుదరదు... దానికి తగ్గ సంసిద్ధత ఉందో లేదో చూసుకోవాలి.....
🌷🌹🌷🌹🙏🌷🌹🌷🌹

Labels:

0 Comments:

Post a Comment

<< Home