Wednesday, May 13, 2020

Birth is a lie, death is the Reality .

" నన్ను శరీరంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే జననం ఒక అబద్ధం. నన్ను శరీరంలోంచి బయటికి తీసే మరణం  ఒక నిజం . అబద్ధం నుండి నిజం వైపు సాగేదే ................            జీవితం .

ఈ శరీరం మనం కాదు అన్న భావన ప్రతి ఒక్కరికి కలగాలి

మాట్లాడేది శరీరం కాదు ,మనమే .నోరు మూసి ,కళ్ళు మూసి మనం మెదడు ప్రదేశంలో మాట్లాడతాం(శరీరంలోని మరే ప్రేదేశంలో మాటలు ,ఆలోచనలు ఉండవు). మాట్లాడేది మనమే కానీ మెదడు కాదు .మెదడున్న ప్రదేశంలో మాట్లాడతాం. 

చూసేవి కళ్ళు కాదు ,కళ్ల ద్వారా మనం చూస్తాం.చెవులు వినవు ,చెవుల ద్వారా మనం వింటాం .నాలుకకు రుచి తెలియదు ,రుచి తెలిసేది నాలుక ద్వారా మనకు .అలా చర్మం ద్వారా స్పర్శ మనకు తెలుస్తుంది .olfactory glands ద్వారా వాసనను మనం తెలుసుకుంటాం.

 శరీరమే అన్నీ తెలుసుకునేది అయితే శవం  ఎందుకు చూడదు? ఎందుకు వినదు ,ఎందుకు స్పర్శకు స్పందించదు? శవం ఎందుకు ఆలోచించదు, ఎందుకు మట్లాడదు? 

ఎందుకంటే చూసేవాడు ,వినేవాడు, స్పందించేవాడు శరీరాన్ని వదిలేసాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి  ! మనం శరీరంలో ఉండేవాళ్ళమే కదా ? 

అంటే శరీరం వేరు, మనం వేరు . అతను పైలోకాలకు వెళ్ళిపోయాడు అంటాం,( మన కళ్లముందరే శరీరం అక్కడే ఉంటుంది.శరీరమే అతడైతే పోయాడని ఎందుకనాలి,అక్కడే ఉన్నాడు. శరీరాన్ని వదిలి వెళ్లిపోయాడని అర్థం. 

అంటే శరీరం వేరు ,నేను వేరు.మేను ఎప్పటికీ నేను కాదు .

నేను సెపరేట్ మేను సెపరేట్ . ఈ" నేను" ను మనం ఆత్మ అనీ సోల్ అనీ ,సెల్ఫ్ అనీ అంటాం.

మనం మన స్వస్తితిని అనగా ఆత్మస్థితిని కోల్పోయి శరీర స్థితిలో బతుకుతున్నాం !  అందుకే వందల సమస్యలు  ! 

 మనం అంతా ఆత్మలం .ఆత్మస్థితిలో ,జ్ఞానస్థితిలో ,ధ్యానస్థితిలో ఉండాల్సినోల్లం. శరీరం వేరు మనం వేరు .ఒకటొది మాంస శరీరం. రెండోది సూక్ష్మ శరీరం.మూడోది ప్రాణ శరీరం. నాల్గోది మనో శరీరం. ఐదోది జ్ఞాన శరీరం. ఆరోది విజ్ఞాన శరీరం. ఏడోది ఆత్మశరీరం. ఆరు శరీరాలు రాలితే మిగిలేది ఆత్మ. నిరంతరం ఆత్మ స్థితిలో ఉండాలంటే సాక్షి ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి .శుభమస్తు.

Labels:

0 Comments:

Post a Comment

<< Home