Wednesday, May 27, 2020

No excuses for inner journey

భగవాన్ రమణ మహర్షి జీవితం మనందరికి తెలుసు.... ఆయన ఇల్లు వదిలిన దగ్గర నుండి అడుగడుగునా ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు... సరైన తిండి దొరకలేదు, ఉండటానికి ఒక నివాసము దొరకలేదు...అయితే ఆయన నిరంతర సమాధి స్థితిలో ఉండటం వలన అవి ఏవీ కూడా ఆయనను బాధించలేదు.... ఆ రకంగా ఆయన అంత కఠినమైన తపస్సు చేసి లోకానికి మాత్రం ఎంతో సులభమైన ఆత్మ విచారణా మార్గం అందించారు..... 
కానీ ఈ రోజు మనకు అన్నీ ఉన్నాయి.... మూడు పూటలా తిండి ఉంది, ఇల్లు ఉంది, శరీరానికి బట్టలు ఉన్నాయి.... ఏ పూటకు ఆ పూట తిండి వెతుక్కోవాల్సిన పరిస్థితులు లేవు.... కానీ మనం ఎందుకు సాధన చేయలేక పోతున్నాము... అతి సులువైన విచారణ ఎందుకు చేయలేక పోతున్నాము??? ఆలోచించండి... 
ఏ రోజుకారోజు ఏదో ఒక సాకు చెప్పి రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపేస్తున్నాము.... మనం చెప్పే సాకులు ఏలాంటివంటే అలలు ఆగితే స్నానం చేస్తాను అన్నట్టు  ఉంటాయి.... ఇక ఎప్పటికైనా స్నానం చేయగలరా ???? 

ఎంతసేపటికి సంసారాన్ని ఎలా వృద్ధి చేయాలి, ఇంకా బెటర్ గా ఎలా చేయాలి, పోయిన సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం ఏమి చెయ్యాలి అనే ప్రణాళికలతోనే జీవితం గడిచి పోతోంది.... మీరు చేసేవన్నీ మంచి పనులుగానే కనబడతాయి.... అన్నీ బాధ్యతలు లాగానే కనబడతాయి..... కానీ ఇదంతా మాయ చేసే మోసం అని తెలుసుకొనే సరికి చావు దగ్గరకు వస్తుంది...... 
ఇన్ని రోజులు ఈ లాక్ డౌన్ కారణంగా సినిమాలు, షికార్లు, పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, సభలు, సత్సంగాలు, గుళ్ళు, గోపురాలు, అర్చనలు, అభిషేకాలు ఇవేవీ మనకు అందుబాటులో లేవు.... అయినా మన జీవితం గడిచింది... బోలెడంత time మిగిలింది.... నిజంగా ఈ time తనతో తాను ఉండటానికి ఎంతో సహాయ పడింది.... నిజంగా ఉపయోగించు కున్న వాళ్లకు.... అంతే కాకుండా సరిగ్గా ఈ సమయంలోనే మన బలహీనతలు ఏమిటి, అవి నిజంగా జీవితానికి అవసరమా.....   లేదా ఇంతవరకు మన  మనసు చేసిన మాయాజాలమా అనేది కూడా  అర్థమయింది అనుకుంటా .....

కొంతమంది అయితే లాక్ డౌన్ ఎప్పుడు తీస్తారా బయట ప్రపంచం ఎలా ఉందో చూడాలని కాచుకో ఉన్నారు.... మళ్ళి గుళ్ళు, గోపురాలు, మైకులు, భజనలు, సత్సంగాలు, అరుపులు, ఆచారాలు, ఏవో వాదనలు ఇంకా ఎన్నో అన్నీ వచ్చి మీద పడటానికి రెడీగా ఉన్నాయి..... మళ్ళి ఈ ప్రవాహంలో గుడ్డిగా కొట్టుకొని పోవడమే..... 
నిజంగా తెలుసుకోవాల్సిన సత్యమేమో ఎక్కడో లోతుల్లో ఉంది, ప్రయత్నాలేమో ఒడ్డున ఉన్నాయి..... 
సత్యం తెలుసుకోవాలంటే హృదయంలో మునిగి పోవాలి... ఇక బయటకు రాకుండా మునిగి పోవాలి.....

Labels:

0 Comments:

Post a Comment

<< Home