Thursday, August 13, 2020

Maharshi with monkeys

 ఒక రోజు సాయంత్రం,  చీకటి పడుతున్న సమయంలో మహర్షి బయట బల్ల మీద కూర్చుని ఉండగా,   దూరంగా ఉన్న మర్రిచెట్టు దగ్గర నుండి గట్టిగా కోతులు అరుపులు వినబడ్డాయి.    మహర్షి చప్పున ఆ చెట్టు దగ్గరకు వెళ్లారు.    ఒక భక్తుడు కూడా మహర్షితో పాటు వెళ్ళాడు. 

  ఆ చెట్టు కొమ్మ మీద సుమారు పాతిక కోతులు ;  వాటి మధ్యలో భుజాలపైన ఒక చిన్న కోతి పిల్లని పెట్టుకొని ఒక ముసలి కోతి ఉన్నాయి. 

  మహర్షి తిన్నగా ఆ ముసలి కోతి దగ్గిరకి వెళ్లారు.    అది ఏమేమో చెపుతోంది.    మహర్షి శ్రద్ధగా వింటూ జాలిగా మారిన వదనంతో కంటి వెంట కన్నీరు కారుస్తూ,   ఆర్తి నిండిన స్వరంతో    "తాతా! ఎంత కష్టం వచ్చింది నీకు.   ఈ వయసులో ఈ బిడ్డను నీవు పెంచాల్సి వచ్చింది.   జాగ్రత్తగా సాకు.   ఇది  నీకు  పుణ్యం"    అంటూ ఆ ముసలి కోతిని లాలించారు మహర్షి.

ప్రక్కనున్న భక్తునికి ఇవేమీ అర్థంకాక చూస్తున్నాడు. మహర్షి అతని వంకకు తిరిగి ఇలా సెలవిచ్చారు .....

"నీకు తెలిసిందా!   దీని వింత?   ఆ చిన్న కోతి పిల్లల తల్లి చచ్చిపోయింది.    కోతుల సంప్రదాయం ఏమిటంటే,   తల్లి లేని పిల్లను ఆ జట్టులోని పెద్ద కోతి పెంచాలి.   ఇది వాటి  కట్టుబాటు.    ఇప్పుడీ పిల్లను పెంచే భారం మన ముసలి కోతిపై పడింది".    ఆ కష్టం నాతో చెప్పుకోవడానికి వీరు పాపము యీ సంధ్య చీకట్లో వచ్చారు.

Labels:

0 Comments:

Post a Comment

<< Home